గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక వాయుసేన కేంద్రంలో మంగళవారం నుంచి క్షిపణి పరీక్షలు నిర్వహించడానికి వైమానిక దళం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 24, 25, 27, డిసెంబరు 1, 2న కంబైన్డ్ గైడెడ్ మిస్సైల్ వెహికల్ ద్వారా భూతలం నుంచి నింగిలోని నిర్దేశిత లక్ష్యాలను చేధించే ఆకాష్, ఇగ్లా, స్పైడర్, ఓఎస్‌ఏ-ఏకే-ఎం క్షిపణులను సూర్యలంక సముద్ర తీరంలో పరీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో 12 రోజుల పాటు సముద్ర తీరంలో చేపల వేటను నిషేధిస్తూ మత్స్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. వైమానికదళ ఉన్నతాధికారులు, నిపుణులు ఇప్పటికే సూర్యలంక చేరుకున్నారు.
సూర్యలంకలో నేటి నుంచి క్షిపణి పరీక్షలు - సూర్యలంకలో నేటి నుంచి క్షిపణి పరీక్షలు తాజా వార్తలు
సూర్యలంకలో ఈరోజు నుంచి క్షిపణి పరీక్షలు నిర్వహించడానికి వైమానిక దళం అన్ని ఏర్పాట్లు చేసింది. వీటిని సూర్యలంక వాయుసేన కేంద్రంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే వైమానికదళ ఉన్నతాధికారులు , నిపుణులు సూర్యలంక చేరుకున్నారు.
krishnalanka