ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సేంద్రీయ విధానంలో మిర్చి సాగు మంచి ఫలితాలు ఇస్తుంది: జీవీఎల్ - జీవీఎల్ నరసింహారావు తాజా వార్తలు

సేంద్రీయ విధానంలో మిర్చి సాగు చేయడం వలన మంచి దిగుబడి వస్తుందని మిర్చి టాస్క్​ఫోర్స్ కమిటీ ఛైర్మన్ జీవీఎల్ నరసింహారావు అన్నారు. సేంద్రీయ సాగుపై జరిగిన ఆన్​లైన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మెరుగైన యాజమాన్య విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

gvl narasimha rao
జీవీఎల్ నరసింహారావు

By

Published : Nov 12, 2020, 12:13 PM IST

సేంద్రీయ విధానంలో మిర్చిసాగు, మెరుగైన యాజమాన్య విధానాలపై రైతులకు అవగాహన కల్పించటం ద్వారా ఎగుమతులు పెరుగుతాయని.. మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆన్​లైన్ సమావేశంలో పాల్గొన్న జీవీఎల్ మాట్లాడుతూ.. మిర్చి రైతులకు ఆదాయం పెంచాలి, వారి జీవితాలు మెరుగవ్వాలని ఆకాంక్షించారు. సుగంధ ద్రవ్యాల సాగులో నాణ్యత ప్రమాణాలు పాటిస్తే ఎగుమతులు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. దిగుబడులు పెంచటం ఒక్కటే సరిపోదని... నాణ్యతతో పాటు పురుగుమందుల అవశేషాలు లేని పంట ఉత్పత్తులు అందించాలని సూచించారు. దీనికోసం సుగంధ ద్రవ్యాల బోర్డు చర్యలు చేపట్టిందని... వాటిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్నారు.

సేంద్రీయ విధానంలో మిర్చి సాగు మంచి ఫలితాలు ఇస్తోందని జీవీఎల్ అన్నారు. నిషేధిత పురుగు మందులు, బయో ఫెస్టిసైడ్స్ వాడకుండా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పంటలకు, ప్రజారోగ్యానికి ప్రమాదం కలిగించే పురుగుమందులు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసిందని వివరించారు. మెరుగైన యాజమాన్య విధానం పాటించేలా రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details