ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MP Avinash: ముస్లిం మహిళను బజారుకు ఈడ్చే ప్రయత్నం: మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి

Minority Rights Protection Committee : కడప ఎంపీ అవినాష్​ రెడ్డిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్​ రెడ్డి మహిళలను కించపరిచేలా వ్యవహరించారని.. ముస్లిం మహిళను బజారుకు ఈడ్చే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. అవినాష్​ రెడ్డి ఇలా చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Farooq Shibli
ఫారూఖ్ షిబ్లీ

By

Published : Apr 18, 2023, 9:05 PM IST

Minority Rights Protection Committee : రాష్ట్రంలో కేవలం వైయస్ కుటుంబానికే విశ్వనీయత, కుటుంబ మర్యాద ఉంటుందా.. వేరే వారికి ఉండదా అని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ ప్రశ్నించారు. వైఎస్ అవినాష్ రెడ్డి ముస్లిం మైనారిటీ మహిళను, వారి వ్యక్తిగత జీవితాన్ని బజారుకు ఈడ్చే ప్రయత్నం చేశారని అన్నారు. ఇలా చేయటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఒక్క వ్యక్తి భవిష్యత్​ కోసం రాష్ట్రాన్ని కేంద్రం దగ్గర మోకరిల్లేలా రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితి ఉందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పిలుపునిచ్చారు.

అప్పుడు సీబీఐపై కేసులు : సీబీఐ విచారణ నిలిపివేయాలని సీబీఐని విమర్శించిది అవినాష్​ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. సీబీఐపైన కేసులు పెట్టింది మీరు కాదా అని అవినాష్​పై ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య సంగతి మాట్లాడకుండా.. ముస్లిం సమాజంపై అవినాష్​ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అనైతికమన్నారు. ముస్లిం మహిళతో వివాహేతర సంబంధం ఉందని అనటం.. ఇతర మహిళలతో వివేకాకు వివాహేతర సంబంధం ఉందని అనటం హీనమైన చర్య అని దుయ్యబట్టారు. ఇవి ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలు కాదని.. నాలుగు సంవత్సరాల క్రితం మాట్లాడవలసినవని అన్నారు. సిట్​ విచారణ జరిగినప్పుడు ఈ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదన్నారు. మీ తప్పు ప్రపంచానికి తెలిసినప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు.

హత్య చేసిందే కాకుండా.. సమాజం దృష్టి మళ్లించేందుకు అనవసర విషయాలను ప్రస్తావిస్తున్నారని తెలిపారు. వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసులను వాడుకుని మీరు అధికారంలోకి వచ్చి అందలం ఎక్కిన విషయం స్పష్టమవుతోందని ఆరోపించారు. హత్య కేసులో ప్రధాన పాత్ర పోషించిన డ్రైవర్​ దస్తగిరి తన తప్పును తెలుసుకుని అప్రూవర్​గా మారి వాస్తవాన్ని ప్రపంచ దృష్టికి తీసుకవచ్చారన్నారు.

టీడీపీపై విమర్శలు మరిచిపోయారా : వివేకా హత్య జరిగినప్పుడు టీడీపీపై చేసిన విమర్శలు మరిచిపోయారా అని ప్రశ్నించారు. వివేకా హత్య టీడీపీ కుట్ర అని, నారాసుర రక్త చరిత్ర అని, నారా కత్తి అని, లోకేశ్​ కత్తి అని చేసిన విమర్శలను మరిచిపోయారా అని ప్రశ్నించారు. కోడి కత్తి కేసులో నిందితుడైన శీను ఓ దళిత యువకుడని.. నాలుగు సంవత్సరాల నుంచి అతనికి బెయిల్​ రాకపోవటం సరికాదని అన్నారు. డ్రైవర్​ను చంపి డోర్​ డెలివరి చేసిన వ్యక్తికి బెయిల్​ వచ్చి.. శీను దాడికి పాల్పడితే దానిని తెర మీదకు తీసుకువచ్చి అధికారంలోకి రావటానికి వాడుకున్నారని దుయ్యబట్టారు. కోడి కత్తి కేసులో నిందితుడికి బెయిల్​ రాకపోవటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. శీనుకి అండగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి లీగల్​ బృందం అండగా ఉంటుందని తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details