ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయపూడిలో మైనార్టీల ధర్నా.. కౌలు డబ్బులు విడుదల చేయాలని డిమాండ్​ - amaravthi farmers latest updates

కౌలు డబ్బులు విడుదల చేయాలంటూ తుళ్లూరు మండలం రాయపూడిలో మైనార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రాయపూడిలో మైనార్టీల ధర్నా
రాయపూడిలో మైనార్టీల ధర్నా

By

Published : Oct 24, 2021, 4:56 PM IST

కౌలు డబ్బులు విడుదల చేయాలంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల వద్ద మైనార్టీ, బీసీ నేతలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తమకు ఇంతవరకు కౌలు చెక్కులు.. అసైన్డ్ భూములకు డబ్బులు వేయలేదని నేతలు చెప్పారు.

తమకు కౌలు చెక్కులు సకాలంలో విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం దిగిరాకపోతే మైనార్టీలను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని ముస్లిం నేతలు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఇంటికి కన్నం వేసి.. ఇల్లంతా కారం చల్లిపోయారు!

ABOUT THE AUTHOR

...view details