ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో మరో దారుణం.. చిన్నారిపై ఇద్దరు మృగాళ్ల అత్యాచారం! - gang raped in guntur

బీటెక్ విద్యార్థి రమ్య దారుణ హత్య ఘటన మరవకముందే.. గుంటూరు జిల్లాలో మరో దారుణం వెలుగు చూసింది. రాజుపాలెంలో చిన్నారిపై ఇద్దరు మృగాళ్లు అత్యాచారం చేసి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఒకరిని అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.

rape incident at rajupalem
minor girl gang raped at rajupalem

By

Published : Aug 20, 2021, 9:15 PM IST

గుంటూరు జిల్లా రాజుపాలెంలో బుధవారం ఓ బాలిక అత్యాచారానికి గురైంది. రాజుపాలెంలో ఉండే వృద్ధురాలు ఇటీవలె మృతి చెందింది. ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గుంటూరులో ఉంటున్న ఆమె కుమారుడు భార్య, ముగ్గురు కుమార్తెలతో కలిసి రాజుపాలెం వచ్చారు. రెండు రోజుల క్రితం పెద్దకర్మ ముగించుకొని బుధవారం తిరిగి గుంటూరు బయల్దేరుతున్నారు. పెద్ద కుమార్తె పక్కనే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగివస్తుండగా.. అదే కాలనీకి చెందిన ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. అక్కడ నాలుగు గంటల పాటు నిర్భందించి అత్యాచారం చేసి పరారయ్యారు. ఆమె కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు తీవ్ర రక్తస్రావంతో బాలిక కనిపించడంతో హుటాహుటిన గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఒకరు అరెస్ట్..

చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మానసిక పరిస్థితి సరిగాలేని చిన్నారిపై నిందితుడు అత్యాచారానికి యత్నించాడని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. నిందితుని పేరు లాబాన్ అని.. అతడు పాపకు దూరపు బంధువని వివరించారు. ఇంటి నుంచి మధ్యాహ్నం పాప.. వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళుతున్నప్పుడు.. నిందితుడు పిలిచి అత్యాచారానికి యత్నించాడని తెలిపారు. ఈ ఘటనకు 15 రోజుల ముందు కూడా అత్యాచారానికి యత్నించాడని వెల్లడించారు. ఈ కేసులో మరో నిందితుడు కూడా ఉన్నాడని అతన్ని పట్టుకునే పనిలో ఉన్నామని చెప్పారు.

ఇదీ చదవండి

చేపల చెరువులో దేవతామూర్తుల విగ్రహాలు.. రంగంలోకి పురావస్తు అధికారులు

ABOUT THE AUTHOR

...view details