ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైనర్​ ఆత్మహత్య.. తండ్రి మరణంతో కుంగిపోవడమే కారణమా? - ఆత్మహత్యవార్తలు

గుంటూరు జిల్లాలో భార్గవ సత్యనారాయణ (14) అనే బాలుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో ఈ ఘటన జరిగింది. తండ్రి మరణంతో మానసికంగా కుంగిపోవడమే బలవన్మరణానికి కారణమని తెలుస్తోంది.

boy suicide
మైనర్​ బాలుడు ఆత్మహత్య

By

Published : May 16, 2021, 10:10 AM IST

గుంటూరు జిల్లాకు చెందిన భార్గవ సత్యనారాయణ (14) అనే బాలుడు.. గతేడాది తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కొన్నాళ్లుగా మానసికంగా కుంగిపోయాడు. ఇదే క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిన్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

గమనించిన బాలుడి తల్లి, సోదరుడు.. బంధువుల సాయంతో ఇంటి తలుపులు పగులగొట్టి తెనాలి వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details