ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు: మంత్రులు - ఏపీలో కరోనా వార్తలు

కరోనా నియంత్రణ చర్యలపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గుంటూరు కలెక్టరేట్​లో సమీక్షించారు. రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలు.. తీసుకుంటున్న చర్యలపై వివరాలు మీడియాకు వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నిత్యావసరాల సరకుల రవాణాను అడ్డుకోవద్దని అధికారులను మంత్రి మోపిదేవి ఆదేశించారు.

ministers review at guntoor on lock down over corona affect
ministers review at guntoor on lock down over corona affect

By

Published : Mar 26, 2020, 4:58 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోందని.. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని భరోసా ఇచ్చారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై గుంటూరు కలెక్టరేట్​లో మంత్రులు సుచరిత, మోపిదేవితో కలిసి సమీక్షించారు.

మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఆళ్ల నాని

గుంటూరులో కరోనా పాజటివ్ కేసు నమోదు.. తదనంతరం చేపట్టిన చర్యలను మంత్రి నాని వివరించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అప్రమత్తంగా ఉంటే చాలని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 332 శాంపిళ్లను పరీక్షించగా... 289 నెగెటివ్ గా వచ్చాయన్నారు. 10 కేసులు పాజిటివ్ గా నమోదైనట్లు తెలిపారు. మరో 33 ఫలితాలు రావాల్సి ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చిన 2400 మందిని పరిశీలనలో ఉంచామని... త్వరలోనే మరో మూడు వ్యాధి నిర్థరణ ల్యాబ్​లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

అధికారులకు ఆదేశాలు

మీడియాతో మాట్లాడుతున్న మంత్రి మోపిదేవి

నిత్యావసర సరకులు, మత్స్య, ఆక్వా ఉత్పత్తుల రవాణాను అడ్డుకోవద్దని మంత్రి మోపిదేవి అధికారులను ఆదేశించారు. అరుదైన విపత్తును ఎదుర్కొంటున్నామని... కాస్త కష్టమైనా ప్రజలు సహకరించాలని హోం మంత్రి సుచరిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

తెల్లవారుజాము నుంచి రోడ్డుపై పడిగాపులు

ABOUT THE AUTHOR

...view details