ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలనే ముఖ్యమంత్రి జగన్ తపన పడుతున్నారు తప్ప ... ఎలాంటి స్వార్థం లేదని ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం టెండర్ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దన్న హైకోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించిన తర్వాత స్పందిస్తామని వెల్లడించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులే రైతులపై వైకాపా ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శమన్నారు. ఈ విషయంలో తెదేపా తమను ప్రశ్నించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. నాడు అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రతిపక్షం ఎన్నో తప్పులు చేసిందని కన్నబాబు విమర్శించారు. 3వేల 200 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు 780కోట్ల రూపాయలు ముందస్తు చెల్లించడం ఎంతవరకూ న్యాయమని కన్నబాబు ప్రశ్నించారు.
తీర్పును పూర్తిగా పరిశీలిస్తాం.. తర్వాతే స్పందిస్తాం: మంత్రులు - _Ministers On Court Judgement Issue Of Rivers Tendering
పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు రీ టెండర్ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దన్న హైకోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించిన తర్వాత స్పందిస్తామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
"పోలవరం టెండర్ ప్రక్రియపై ... కోర్టు తీర్పును పూర్తిగా పరిశీలిస్తాం"