కరోనా మహమ్మారిపై పోరాటానికి అందరూ నడుం బిగించాలని రాష్ట్ర హోంమంత్రి సుచరిత పిలుపునిచ్చారు. వైరస్ చైన్ బ్రేక్ చేయడం అందరి ప్రథమ కర్తవ్యం కావాలని సూచించారు. సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత, అనుమానిత లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. గుంటూరు కన్వెన్షన్ హాల్లో వైకాపా ఆధ్వర్యంలో పాత్రికేయులు, మీడియా ప్రతినిధులకు మంత్రి మోపిదేవి వెంకట రమణతో కలిసి ఆమె నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు, వైద్యసిబ్బందితోపాటు మీడియా ప్రతినిధులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని మంత్రులు కొనియాడారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు చేరవేస్తూ...వారిని చైతన్యవంతం చేయడంలో పాత్రికేయులు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని హోంమంత్రి వ్యాఖ్యానించారు. వాలంటీర్ వ్యవస్థ దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి మోపిదేవి అభిప్రాయపడ్డారు.
'కరోనాపై పోరుకు అందరూ నడుం బిగించాలి'
విపత్కర పరిస్థితుల్లో పోలీసులు, వైద్య సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని మంత్రులు సుచరిత, మోపిదేవి కొనియాడారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి అందరూ నడుం బిగించాలని కోరారు.
కరోనాపై పోరుకు అందరూ నడుంబిగించాలి