"జగనన్న స్వచ్ఛ సంకల్పం-క్లీన్ ఆంధ్రప్రదేశ్"(Clean Andhra Pradesh news) కార్యక్రమాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అమలు చేస్తున్నామని.. ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉండవని మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(ministers botsa satyanarayana and peddireddy on CLAP news) స్పష్టం చేశారు. నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. గాంధీ జయంతి రోజున విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఉదయం పదిన్నర గంటలకు చెత్త సేకరణ వాహనాలను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు.
నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీలలోనూ 3097 హైడ్రాలిక్ గార్బేజ్ ఆటోలు, వాటితో పాటు నగర పంచాయతీలు, థర్డ్‌గ్రేడ్ మున్సిపాల్టీల్లో ఇంకో 1771 ఈ-ఆటోలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రులు తెలిపారు. ఇప్పుడున్న వారితో కలిపి మొత్తం 38 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం భాగస్వాములు అవుతారని చెప్పారు. వాటర్ ప్లస్ సిటీలుగా దేశంలో తొమ్మిది ఎంపికైతే.. వాటిలో మూడు నగరాలు రాష్ట్రంలోనే ఉన్నాయని.. మురుగు నీటి శుద్ధి, పునర్వినియోగంలో తిరుపతి, విజయవాడ, విశాఖ నగరాలు ఎంపికవ్వటాన్ని తాము గర్వంగా చెబుతున్నామన్నారు.
ఆయనకు ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ..
ప్రజలకు సేవ చేయడమే తప్ప, ఫొటోలకు, ప్రచారానికి ముఖ్యమంత్రి()cm jagan ప్రాధాన్యం ఇవ్వబోరని మంత్రులు అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ అని.. క్లాప్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సాయంతో జరుగుతున్నది కాదన్నారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న యూజర్ ఛార్జీల ద్వారా వచ్చిన డబ్బులతోనే వాహనాలు కొనుగోలు చేశామని తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం ఒక్క పైసా కూడా లేదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో యూజర్ ఛార్జీలను ఇంకా నిర్ణయించలేదన్నారు. నిధులు సరిపోకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్‌గా విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. గత ఏడాది కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో ఆగస్టు, అక్టోబరులో పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహిస్తే, అంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని వంద రోజుల కార్యక్రమాన్ని రేపటి నుంచి మొదలుపెడుతున్నామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు. సీసీ డ్రెయిన్ల నిర్మాణాలు జరిగాయని.. అవన్నీ పరిశుభ్రంగా ఉండడంలో ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని చెప్పారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో పాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు తగ్గిన తర్వాత నూటికి నూరు శాతం రహదారులు మరమ్మత్తులు, అభివృద్ధి చేస్తామని అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రహదారులను పట్టించుకోలేదని విమర్శించారు.
'రేపు విజయవాడలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం. క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా 100 రోజులు అనేక కార్యక్రమాలు చేపడతాం. అన్ని పంచాయతీల్లో సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ విధానం అమలు చేస్తాం. క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో 10 వేల మంది కార్మికులు పాల్గొంటారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కోసం వాహనాలు పంపిణీ చేస్తాం. ప్రతి ఇల్లు, వీధి, గ్రామం శుభ్రంగా ఉండాలి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనాలి' -పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి
ఇదీ చదవండి
ప్రధాని మోదీతో పంజాబ్ ముఖ్యమంత్రి భేటీ