ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆశావర్కర్ విజయలక్ష్మి కుటుంబసభ్యులను పరామర్శించిన మంత్రులు - mekathoti sucharitha latest news

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో కరోనా వ్యాక్సిన్ తీసుకొని మృతి చెందిన ఆశావర్కర్ విజయలక్ష్మి కుటుంబసభ్యులను మంత్రులు ఆళ్ల నాని, మేకతోటి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం నుంచి వారికి రూ.50 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారు.

ministers
మంత్రులు ఆళ్ల నాని, మేకతోటి సుచరిత

By

Published : Jan 25, 2021, 4:34 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో కొవిడ్​ టీకా తీసుకుని మరణించిన ఆశావర్కర్​ విజయలక్ష్మి కుటుంబ సభ్యులను మంత్రులు ఆళ్ల నాని, మేకతోటి సుచరిత పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అర్హతను బట్టి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు కట్టిస్తామని మంత్రులు చెప్పారు. ప్రభుత్వం నుంచి 50లక్షల పరిహారాన్ని అందిస్తామన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షా 50 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని అందులో 39 మందికి స్వల్ప అనారోగ్య లక్షణాలున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. వారందరికీ చికిత్స అందిస్తున్నామని.. త్వరలోనే కోలుకుంటారని తెలిపారు. వ్యాక్సిన్ పట్ల ప్రజలు ఎవరూ అపోహపడొద్దని అన్నారు. కొవిడ్​ టీకా వల్ల రాష్ట్రంలో ఎవరూ చనిపోలేదని వెల్లడించారు.

ఇదీ చదవండి:కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ మృతి.. బంధువుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details