Health Minister Vidadala Rajini: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిని త్వరలోనే ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడుదల రజిని చెప్పారు. సోమవారం ఎయిమ్స్ ఆసుపత్రిలో పర్యటించిన ఆమె.. వివిధ విభాగాలను పరిశీలించారు. ఎయిమ్స్‌లో అందుతున్న వైద్య సేవలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మారై, సిటీ స్కాన్, మామోగ్రఫి యంత్రాలను ఎయిమ్స్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఎయిమ్స్‌కి కావాల్సిన మౌలిక వసతులపై అధికారులతో సమీక్షించారు.
మంగళగిరి ఎయిమ్స్ని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తాం: మంత్రి విడుదల రజిని - AIIMS Hospital in AP
Health Minister Vidadala Rajini: రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడుదల రజిని సోమవారం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో పర్యటించారు. ఎయిమ్స్‌లో అందుతున్న వైద్య సేవలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆత్మకూరు చెరువు నుంచి ఎయిమ్స్‌కి అవసరమైన నీటిని తరలించేందుకు ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం పనులను ప్రారంభించారు.
మంగళగిరి ఎయిమ్స్
మంగళగిరి మండలం ఆత్మకూరు చెరువు నుంచి ఎయిమ్స్‌కి అవసరమైన 2లక్షల 25వేల లీటర్లు నీటిని తరలించేందుకు 7కోట్ల 40లక్షలతో ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం పనులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎయిమ్స్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు. దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్ ను ఇతర ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు.
ఇవీ చదవండి: