Vaikuntha Ekadashi At Tirumala: శ్రీవారి భక్తుల కోరిక మేరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంత్రి వెల్లంపల్లి కుటుంబ సభ్యులతో కలిసి.. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బంగారు శంఖం నుంచి స్వామి వారి తీర్థాన్ని స్వీకరించారు.
Vellampalli: తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు: మంత్రి వెల్లంపల్లి
Vaikuntha Ekadashi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న ఆయన.. శ్రీవారి భక్తుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైష్ణవాలయాల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఇదీ చదవండి: Tirumala: తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు