ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోం మంత్రి స్పందించారు.. అధికారులను కదిలించారు!

నాడు - నేడు పనులు ఏడాది కాలం నుంచి నిలిచిపోవడంపై 'నాడైనా... నేడైనా అంతే' అనే శీర్షికతో ఈనాడులో ఇచ్చిన కథనానికి హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. పనులలో నాణ్యత లోపంపై వివరాలు అడిగి త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

minister respond
హోంమంత్రి స్పందన

By

Published : Jun 24, 2021, 3:48 PM IST

గుంటూరు జిల్లా కాకుమాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాడు - నేడు పనులు ఏడాది కాలం నుంచి నిలిచిపోవడంపై 'నాడైనా... నేడైనా అంతే' అనే శీర్షికతో ఈనాడులో ఇచ్చిన కథనానికి హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. రూ.34 లక్షలతో జరుతున్న నాడు నేడు పనులు ఎందుకు ఆగాయని అధికారులను ఆరా తీశారు. పనులలో నాణ్యత లోపంపై వివరాలు అడిగారు.

వెంటనే ఆసుపత్రిలో పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో కాకుమాను ఆసుపత్రిని ఆర్అండ్​బీ శాఖ ఎస్ఈ మాధవి సుకన్య పరిశీలించారు. పనుల నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు చేసిన పనులలో నాణ్యత లేదన్నారు. చేసిన పనులు తిరిగి నాణ్యతగా చేయాలని, వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details