గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం బోట్ యార్డులో నిర్మిస్తున్న మోడల్ హౌస్‌ను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ్‌రాజు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో మొత్తం 25లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఈ నమూనా గృహాన్ని ముఖ్యమంత్రి జగన్ సందర్శిస్తారని చెప్పారు. 30లక్షల మంది లబ్ధిదారులకు స్థలాలు ఇచ్చిన తర్వాత వీటి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
మోడల్ హౌజ్‌ను పరిశీలించిన మంత్రి శ్రీరంగనాథ్‌రాజు - గుంటూరు జిల్లా వార్తలు
గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మిస్తున్న నమూనా ఇంటిని గృహనిర్మాణ శాఖ మంత్రి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
మోడల్ హౌజ్‌ను పరిశీలించిన మంత్రి శ్రీ రంగనాథ్‌రాజు