Minister Roja in Youth Festival : ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదనీ.. ఆకాశమే హద్దుగా అందరూ చెలరేగిపోవాలని పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న యువజనోత్సవాల ముగింపు కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఆమెతో పాటు నటుడు సంపూర్ణేశ్ బాబు పాల్గొన్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించేలా యువత తయారవ్వాలని రోజా విద్యార్థులకు సూచించారు. యువజనోత్సవాలలో నిర్వహించిన పోటీ కార్యక్రమాలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
నాగార్జున విశ్వవిద్యాలయంలో యూత్ ఫెస్టివల్.. పాల్గొన్న మంత్రి రోజా - పర్యాటక శాఖ మంత్రి రోజా
Minister Roja : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన యువజనోత్సవాల ముగింపు కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. చదువుతో పాటు విద్యార్థులు తమ ప్రతిభను బయటకు తీసుకురావాలని ఆమె సూచించారు. ఇవి కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని ఆమె తెలిపారు.
![నాగార్జున విశ్వవిద్యాలయంలో యూత్ ఫెస్టివల్.. పాల్గొన్న మంత్రి రోజా Minister Roja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17239854-584-17239854-1671348064249.jpg)
నాగార్జున విశ్వవిద్యాలయంలో యూత్ ఫెస్టివల్
నాగార్జున యూనివర్శిటీలో ముగింపు యువజనోత్సవాల్లో పాల్గొన్న మంత్రి రోజా
"ఇలాంటి యువజనోత్సవాల కార్యక్రమాల వేదికలను ఉపయోగించుకుని.. మీలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకువస్తే మీరు కూడా ఉన్నత స్థానాలకు వెళ్లవచ్చు. చదువు విద్యార్థుల జీవితంలో చాలా ముఖ్యం. చదువుతో పాటు ఇవీ ఉండాలి." - రోజా, పర్యాటక శాఖ మంత్రి
ఇవీ చదవండి: