Minister Roja Dance at Youth Festival: మరుగున పడిపోతున్న కళలకు నేటి యువత ప్రాణం పోస్తోందని పర్యాటకశాఖ మంత్రి రోజా అన్నారు. యువజనశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యువజనోత్సవాల ముగింపు కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. పోటీల్లో విజయం సాధించినవారిని వచ్చే నెల జనవరి 12 నుంచి 16వరకు కర్నాటకలో నిర్వహించే జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు పంపిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 33 ఆంశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో విజయం సాధించిన వారికి మంత్రి రోజా బహుమతులు ప్రదానం చేశారు.
మరుగున పడిన కళలకు యువత ప్రాణం పోస్తోంది: మంత్రి రోజా
Minister Roja Dance: కనుమరుగవుతున్న కళలకు నేటి యువత ప్రాణం పోస్తోందని పర్యాటకశాఖ మంత్రి రోజా అన్నారు. యువజనశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి యువజనోత్సవాల ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. యువజనోత్సవాల్లో విజేతలుగా నిలిచిన వారిని వచ్చే నెల కర్నాటకలో జరిగే జాతీయస్థాయి పోటీలకు పంపిస్తున్నట్లు మంత్రి చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలసి డ్యాన్స్ చేసి వారిని ఉత్సాహపరిచారు.
పతకాలు రాని వాళ్లు నిరుత్సాహం చెందకుండా విజయం సాధించేవరకు కష్టపడాలనీ, అప్పుడే అది సాధ్యమవుతోందని మంత్రి చెప్పారు. వివేకానందుడి ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పడిలేచిన కెరటంలాగా దూసుకెళ్లాలన్నారు. తాను మొదట ఎమ్మెల్యేగా ఓడిపోయానని,.. మరింత కసితో పని చేయడంతో నేడు మంత్రి వరకు ఎదిగానని చెప్పారు. నేటి యువత ముఖ్యమంత్రి జగన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలసి రోజా డ్యాన్స్ చేశారు. ముగింపు వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
TAGGED:
Minister Roja Dance