Minister Roja comments: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ గ్యాప్‌లో వచ్చి.. వీకెండ్లో రెండు గంటలు పీకే డ్రామా చేసి వెళ్లిపోతారని రోజా ఎద్దేవా చేశారు. ఇప్పటంలోని ప్రజలే పవన్‌ను రావద్దని ప్లెక్సీలు పెట్టారని పేర్కొన్నారు. ఇప్పటం ఆక్రమిత స్థలాల విషయంలో హైకోర్టు జరిమానా విధించి లెంపకాయ కొట్టిందన్న రోజా.. ఎవరో రాసిచ్చిన మాటలను ఆవేశంగా ఊగిపోతూ పిచ్చి స్టేట్ మెంట్లు ఇస్తే జనాలెవరూ నమ్మరని రోజా తెలిపారు. హైదరాబాద్‌లోని శాసనసభ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో పాల్గొన్న రోజా.. ఇప్పటంలో పవన్ కల్యాణ్ జోక్యంపై మండిపడ్డారు. జనసేన తరపున 175 స్థానాల్లో పోటీ చేసి హీరో కావాలని సూచించిన రోజా.. బాధ్యత, ఓర్పులేని నాయకులెవరికీ ప్రజలు ఓటు వేయరని ఆమె వ్యాఖ్యానించారు.
పవన్‌పై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు... ఏమన్నారంటే..! - ఏపీలో పవన్ వార్తలు
Minister Roja: వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తానన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. షూటింగ్ గ్యాప్‌లో వచ్చి రెండు గంటలు వీకెండ్ మీటింగ్‌లు పెడితే ప్రజలు నమ్మరని పవన్ గ్రహించాలని.. రోజా సూచించారు. ఎవరో రాసిచ్చిన మాటలను ఆవేశంగా చెబితే సరిపోదన్నారు.
roja