ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణి చేపట్టేందుకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి చెరకువాడ శ్రీరంగనాథ రాజు అధికారులను ఆదేశించారు. ఇండ్ల నిర్మాణాలను, కేటాయింపులను పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా జరగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో ఉండాలన్నారు. వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం పై రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, కార్పొరేషన్ హౌసింగ్ కి చెందిన సంచాలకులు, కార్యనిర్వాహక ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలలో గృహ నిర్మాణం కీలకమైనదని... క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు గృహనిర్మాణాల స్థితిగతులను అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇండ్ల నిర్మాణల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక యాప్ అందుబాటులోకి తీసుకుస్తున్నట్లు తెలిపారు.
ఉగాది నాటికి 25లక్షల మందికి ఇళ్ల పట్టాలు: మంత్రి రంగనాథ్ - amaravati
సచివాలయంలో గృహ నిర్మాణ సంస్థ , హౌసింగ్ కార్పొరేషన్ ఆధికారులతో మంత్రి శ్రీరంగనాథరాజు సమీక్ష నిర్వహించారు.
మంత్రి సమీక్ష