గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న భోజనశాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రంగనాథరాజు పరిశీలించారు. ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం ఏర్పాటు చేసిన భోజనశాలను.. మే 3న ప్రారంభించనున్నట్లు తెలిపారు.
గుంటూరు జీజీహెచ్ భోజనశాలను పరిశీలించిన మంత్రి రంగనాథరాజు - minister ranganatharaju recent news
గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న భోజనశాలని.. మంత్రి రంగనాథ రాజు పరిశీలించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా.. ఏర్పాట్లు పూర్తి చేయటం పట్ల మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారు.
భోజనశాలలో ముగింపు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి.. ఒకేసారి 300 మంది భోజనం చేసేందుకు భోజనశాల ఉపయోగపడుతుందన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా.. నిర్మాణం పూర్తి చేయడం పట్లు మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. మెుత్తం 25 డైనింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయాలనీ.. గ్రౌండ్ ఫ్లోర్లో 12, మెుదటి ఫ్లోర్లో 13 టేబుల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రోగుల సహాయకుల సంతృప్తిగా భోజనం చేసే విధంగా.. ఏర్పాట్లు చేయాలన్నారు. మంచినీరు, డ్రైనేజీ సిస్టంలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి ఇతర డాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'విజ్ఞప్తి రానంతవరకూ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోం'