'జగన్ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు' - andhrapradesh
రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న మంత్రి ప్రత్తిపాటి.
pullarao
ఏపీని మోసం చేసిన మోదీతో జగన్ చేతులు కలిపారని మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు విమర్శించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాత మల్లాయపాలెంలో 3కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేంద్రంపై ధర్మపోరాటం చేస్తుంటే వైకాపా ఆయన కాలు లాగడానికి చూస్తోందని మండిపడ్డారు. మోదీ, కేసీఆర్, జగన్లు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. 3 రోజులలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.