ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు సీఎం కావడం ఖాయం!! - civil supply

''నేను 5 సార్లు నామినేషన్ వేశాను. ఎప్పుడూ ఇంతమంది కార్యకర్తలు నా వెంట ర్యాలీకి రాలేదు. ఈ రోజు సుమారు 50 వేల మంది కార్యకర్తలు నా వెంట వచ్చారు. ఈ సందర్భమే చెబుతోంది... చంద్రబాబుపై ప్రజల్లో ఎంత నమ్మకం ఉందనేది'' - మంత్రి ప్రత్తిపాటి

చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి ర్యాలీ

By

Published : Mar 21, 2019, 7:53 PM IST

ప్రత్తిపాటి ర్యాలీ
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామపత్రాలను ఆయన చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికిఅందజేశారు. అంతకు ముందు దేవాలయాలు, మసీదులో మంత్రి ప్రత్తిపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిమంది తెదేపా కార్యకర్తలు, నాయకుల సందోహంతో చిలకలూరిపేట కిటకిటలాడింది. పార్టీ జెండాలతో పట్టణం పసుపుమయంగా మారింది. రాష్ట్రం అన్ని విధాలాఅభివృద్ధి సాధించాలంటే చంద్రబాబు తప్పక మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి బాసటగా నిలవాలని కోరారు. ఎన్నడూ లేనంతగా ఇవాళ భారీ సంఖ్యలో ప్రజలు తన ర్యాలీకి హాజరయ్యారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details