కరోనా నిర్ధరణైన తొలి గంట నుంచే జాగ్రత్తలు తీసుకునే వారికి ఎలాంటి ప్రమాదమూ జరగదని మంత్రి పేర్ని నాని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శారద సర్వీసు సొసైటీ, రోటరీ క్లబ్ , శ్రీశైల భక్తసేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన.. బ్రేక్ కొవిడ్ తెనాలి డాట్ కామ్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యాప్ ద్వారా తెనాలిలో మెరుగైన వైద్య సూచనలు, సలహాలు పొందవచ్చని.. ప్రజలంతా యాప్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. బ్రేక్ కొవిడ్ తెనాలి డాట్ కామ్ యాప్ రూపొందించిన అలంకృత, మెహర్ దంపతులను మంత్రి పేర్ని నాని అభినందించారు.
నిర్ధరణ అయిన తొలి గంట నుంచే జాగ్రత్తగా ఉండాలి: మంత్రి పేర్ని నాని
కరోనా నిర్ధరణైన తొలి గంట నుంచే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రి పేర్ని నాని. అలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదమూ జరగదని తెలిపారు.
మంత్రి పేర్ని నాని