ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాపుల్ని బీసీల్లో చేర్చడం కుదరదు: పేర్ని నాని - కాపులను బీసీల్లో చేర్చడంపై పేర్ని నాని స్పందన

కాపులను బీసీల్లో చేర్చడం వీలు కాదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఏ అగ్ర కులాన్నీ బీసీల్లో చేర్చడమనేది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, కేంద్రమే అందుకు నడుంకట్టాల్సి ఉందని నాని అన్నారు. కాపులు పేదరికంలో మగ్గుతూ, కాయకష్టం చేసుకుంటూ బతుకు సమరం సాగిస్తున్నారని.. ఈ విషయాన్ని గ్రహించే ముఖ్యమంత్రి జగన్‌ కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించారని చెప్పారు.

perni nani
పేర్ని నాని, మంత్రి

By

Published : Dec 14, 2020, 3:33 PM IST

కాపు వర్గీయులను బీసీల్లో చేర్చడం భారత రాజ్యాంగం, అమలులో ఉన్న చట్టాల రీత్యా వీలు కాదని రాష్ట్ర రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. వైకాపా శ్రేణుల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని పెసర్లంకలో ఏర్పాటైన కాపు కార్తిక వనసమారాధన సభలో ఆయన మాట్లాడారు.

ఏ అగ్ర కులాన్నీ బీసీల్లో చేర్చడమనేది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, కేంద్రమే అందుకు నడుంకట్టాల్సి ఉందని నాని అన్నారు. కాపుల్ని బీసీల్లో చేరుస్తామనే హామీతోనే తెదేపా 2014 ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకుందని ఆరోపించారు. కాపులు పేదరికంలో మగ్గుతూ, కాయకష్టం చేసుకుంటూ బతుకు సమరం సాగిస్తున్నారని.. ఈ విషయాన్ని గ్రహించే ముఖ్యమంత్రి జగన్‌ కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details