Minister Peddireddy's review on Agri Connections: రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లపై విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. కనెక్షన్ల కోసం విద్యుత్ అధికారులు రైతుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదు వస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం వద్దని మంత్రి సూచించారు. ఆక్వాజోన్లలో ఇస్తున్న విద్యుత్ సబ్సీడీపై వివరాలు సమర్పించాలని మంత్రి ఆదేశాలిచ్చారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను పెండింగ్‌లో పెట్టొద్దు: మంత్రి పెద్దిరెడ్డి - YCP Party
Minister Peddireddy's review on Agri Connections: రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లపై విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రానున్న వేసవికి డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ సరఫరా చేసేందుకు డిస్కమ్‌లు, ట్రాన్స్‌కో ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలని సూచించి.. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్ల విషయంలో రైతుల నుంచి ఆధార్, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని త్వరగా సేకరించాలన్నారు.
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ విద్యుత్ అధికారులు పాల్గొనాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు పోల్ టు పోల్ తనిఖీలు చేపట్టాలన్నారు. వచ్చే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. రానున్న వేసవికి డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ సరఫరా చేసేందుకు డిస్కమ్‌లు, ట్రాన్స్‌కో ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలని సూచించారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్ల విషయంలో రైతుల నుంచి ఆధార్, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని త్వరగా సేకరించాలన్నారు.
ఇవీ చదవండి: