ముఖ్యమంత్రి చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో లోకేశ్ ఎన్నికల ప్రచారం చేశారు. పసుపు-కుంకుమను అడ్డుకునేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. జగన్, మోదీ, కేసీఆర్ ఏకమై ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజాతీర్పు తెదేపాకే అనుకూలమని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.
ఎందరు ఏకమైనా... ప్రజలు తెదేపావైపే: లోకేశ్
పసుపు-కుంకుమ ఆపేందుకు వైకాపా కుట్రలు పన్నుతోంది. మోదీ, కేసీఆర్, జగన్ ఏకమై చంద్రబాబును ఇబ్బందులు పెట్టేందుకు పన్నాగం పన్నుతున్నారు. ఎవరెన్ని చేసినా చంద్రబాబే మరోసారి ముఖ్యమంత్రి. తెదేపా తోనే అన్ని వర్గాలకు సమన్యాయం. -నారా లోకేశ్, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి
ఎందరు ఏకమైనా... ప్రజలు చూపు తెదేపా పైనే: మంత్రి నారా లోకేశ్