గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి శాసనసభ ఎన్నికలకు పోటీ పడుతున్న మంత్రి లోకేష్.. ప్రచారంపై దృష్టి పెట్టారు.నియోజకవర్గంలోని స్థానిక నేతలతో కాసేపట్లో భేటీ కానున్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో అందుకు తగిన కసరత్తుపై వేగం పెంచారు. అధినేత నుంచి అధికార ప్రకటన వచ్చిన వెంటనే రంగంలోకి దిగనున్నారు. నియోజకవర్గ నేతలతో సమావేశమై కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
నేడు మంగళగిరికి మంత్రి లోకేశ్ - minister_nara_lokesh_will_be_visited_guntur_district_mangalagiri
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్... కార్యాచరణను ముమ్మరం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నికల బరిలో దిగనున్న నేపథ్యంలో ఇవాళ నియోజకవర్గంలోని స్థానిక నేతలతో భేటీ కానున్నారు. అధినేత చంద్రబాబు నుంచి అధికార ప్రకటన వచ్చిన వెంటనే ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించనున్నారు.

మంత్రి నారా లోకేశ్
TAGGED:
మంత్రి నారా లోకేశ్