కుంచనపల్లిలో మంత్రి నారా లోకేశ్ ప్రచారం నిర్వహించారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో మంగళగిరి తెదేపా అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ ప్రచారం చేశారు. అడుగడుగునా మహిళలు, యువతులు హారతులతో తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. తనను భారీ మెజారిటీతో గెలిపించి... నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను లోకేశ్ కోరారు. మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. జగన్కు ఓటు వేస్తే రాష్ట్రం అదోగతి కాక తప్పదన్నారు.లోకేశ్ అభిమానులతో కలిసి స్వీయ చిత్రాలు దిగి... తన ప్రేమను చాటుకున్నారు.
ఇవీ చూడండి.