ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీ ఓటు అనుభవానికా... అవినీతికా?: లోకేశ్ - తెలుగు దేశం

''రాష్ట్రంలో ఒక్క ఓటు, కార్యకర్త లేని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు... ఆంధ్రా రాజకీయాల్లో జోక్యమెందుకు? రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతూ కుట్రలు చేస్తున్న మోదీ, కేసీఆర్​తో జతకట్టిన జగన్​కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు. ముగ్గురు మోదీలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు'' -రేవేంద్రపాడు ఎన్నికల ప్రచారంలో నారా లోకేశ్

రేవేంద్రపాడు ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేశ్

By

Published : Mar 24, 2019, 4:02 PM IST

Updated : Mar 24, 2019, 6:41 PM IST

రేవేంద్రపాడు ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్​లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక్క ఓటు లేనప్పుడు ఇక్కడి రాజకీయాల్లో కేసీఆర్​ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని మంగళగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో లోకేశ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థించారు. భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తెదేపా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రేవేంద్రపాడులోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దుగ్గిరాలకు పసుపు అధ్యయన కేంద్రాన్ని తీసుకువస్తానని అన్నారు. పసుపు యార్డు ఛైర్మన్ కేశినేని శ్రీధర్ లోకేశ్​ను పసుపు కొమ్ముల మాలతో సత్కరించారు.

ఇవీ చూడండి.

Last Updated : Mar 24, 2019, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details