గుంటూరు జిల్లా భట్టిప్రోలు నుంచి మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల శంఖారావం పూరించారు. భట్టిప్రోలు ప్రాంత అభివృద్ధికి కృషి చేసినందుకు మంత్రి నక్కాకు స్థానికులు అభినందన సభ నిర్వహించారు.రేపల్లె రైతులకు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నామని ఆనందబాబు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు రూ.2 వేల చొప్పున పింఛను ఇస్తున్నామన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక కింద ఐదేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. పట్టిసీమ ద్వారా డెల్టా ప్రాంతానికి నీరిచ్చి రైతులను ఆదుకున్నామని తెలిపారు. చంద్రబాబును బలహీనపర్చేందుకే జగన్, కేసీఆర్, మోదీ కుట్రలు పన్నుతున్నారని మంత్రి ఆక్షేపించారు. రాబోయే ఎన్నికల్లో తెదేపాదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి.
తెదేపా విజయం తధ్యం: మంత్రి నక్కా
రుణమాఫీ, అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నాం. వృద్ధులు, దివ్యాంగులకు రూ.2 వేల చొప్పున పింఛను ఇస్తున్నాం. ఎస్సీ ఉప ప్రణాళిక కింద ఐదేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేశాం. సంక్షేమ పథకాలే తెదేపాను మరోసారి అధికారంలోకి వచ్చేలా చేస్తాయి. - మంత్రి నక్కా ఆనందబాబు
మంత్రి నక్కా ఆనందబాబు