గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని హార్బర్‌ను మంత్రి మోపిదేవి, మత్స్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాన్ వలయాన్, పలువురు అధికారులు సందర్శించారు. హార్బర్‌ను అభివృద్ధి చేసేందుకు జెట్టీని పరిశీలించారు. నిజాంపట్నం హార్బర్ అభివృద్ధికి 371 కోట్లు రూపాయల నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ప్రధాన పోర్టుల్లో మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు ఫేజ్ -2 కింద ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఫేజ్ -1 కింద నెల్లూరు జిల్లా జువ్వల దిన్నే, ప్రకాశం జిల్లాలోని వాడరేవు, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడా, విశాఖ జిల్లాలో పూడిమడక, శ్రీకాకుళం జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం ఐదు జెట్టీలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా హార్బర్స్ వద్ద కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకారులను ఆదుకునే విధంగా ప్రభుత్వం గిట్టుబాటు ధర కూడా కల్పిస్తోందని మంత్రి మోపిదేవి అన్నారు.
నిజాంపట్నం హార్బర్‌ను పరిశీలించిన మంత్రి మోపిదేవి - Nizampatnam Harbor inspected by minister mopidevi
ఆక్వా, మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు అన్నారు.
నిజాంపట్నం హార్బర్‌ను పరిశీలించిన మంత్రి మోపిదేవి