ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా...ఆదుకుంటున్నాం' - మంత్రి మోపిదేవి వెంకటరమణ చెక్కుల పంపిణీ

కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నా...పేద ప్రజల సంక్షేమానికి వైపాకా ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యనించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నంలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కును ఆయన అందించారు.

ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా...ఆదుకుంటున్నాం
ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా...ఆదుకుంటున్నాం

By

Published : Apr 24, 2020, 4:03 PM IST

మునుపెన్నడూ లేని విధంగా మహిళలకు చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నంలో స్త్రీ శక్తి సమాఖ్య కార్యాలయంలో డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కును అందించారు. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా...పేదలకు నిత్యావసరాలతో పాటు వెయ్యి రూపాయల నగదును అందిస్తున్నామన్నారు. అనంతరం ఆముదాలపల్లి పంచాయతీలోని 1300 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ జెండా ఊపి మోపిదేవి ప్రారంభించారు. కరోనాపై పోరుకోసం లక్షా 58 వేల రూపాయల చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్​కి నిజాంపట్నం మండల డ్వాక్రా సంఘాల మహిళలు మంత్రికి అందకేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details