ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రెండు రోజుల్లో... రైతు బజార్లలో ఉల్లి విక్రయ కేంద్రాలు' - latest prices of onions in AP

రాష్ట్రంలో ఉల్లి కొరతను తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. గుంటూరు జిల్ల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడిన మంత్రి... రైతు బజార్లలో రెండ్రోజుల్లో ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.

minister-mopidevi-comments-on-onion-crisis-in-state

By

Published : Nov 17, 2019, 5:17 PM IST

Updated : Nov 17, 2019, 5:48 PM IST

రాష్ట్రంలో ఉల్లి కొరతపై మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఉల్లిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేస్తున్నామని చెప్పారు. రైతు బజార్లలో రూ.25 నుంచి రూ.30 మధ్య విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు బజార్లలో రెండ్రోజుల్లో ఉల్లి విక్రయ కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఉల్లిని అక్రమంగా నిల్వ చేసే గిడ్డంగులపై దాడులు చేపడుతామన్న మోపిదేవి... ప్రజలకు నాణ్యమైన ఉల్లి సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.

'రెండు రోజుల్లో... రైతు బజార్లలో ఉల్లి విక్రయ కేంద్రాలు'
Last Updated : Nov 17, 2019, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details