'అమరావతి' ఆగదు.. అవినీతిపై విచారణ ఆగదు! - minister mopidevi comments on capital city
అమరావతి నిర్మాణం ఆగిపోతుందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని మంత్రి మోపిదేవి కొట్టిపారేశారు. కేవలం అవినీతి వ్యవహారాలపైనే విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.

పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం 3వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి గుంటూరుకు వచ్చిన ఆయన... రోడ్లు, భవనాలశాఖ అతిథి గృహంలో అధికారులతో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలోని మిర్చియార్డు, దుగ్గిరాల పసుపు మార్కెట్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అమరావతి నిర్మాణం ఆగిపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని.... అవినీతి వ్యవహారాలపైనే విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.