Minister Nagarjuna Insults Visitors: కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించాలంటూ కాళ్లరిగేలా తిరుగుతున్నా 20 ఏళ్లుగా ప్రభుత్వం కనికరించటం లేదు. కలెక్టర్కు, సంబంధిత అధికారులకూ చెప్పుకున్నా కనికరించలేదు. పాలనకు గుండెకాయ లాంటి రాష్ట్ర సచివాలయంలో తన గోడు చెప్పుకుందామని వచ్చిన ఆ ఆభాగ్యుల్ని దళితుల సంక్షేమం చూసే ఓ మంత్రి కసురుకున్నారు. మంత్రి అరుపులకు బెదిరిపోయిన ఆ కుటుంబాన్ని తన గన్ మెన్ల చేత బయటకు నెట్టించేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన ఓ బాధిత కుటుంబం ఆవేదన ఇది.
compassionate appointment: కోరుకున్న పోస్టు ఇవ్వడం కుదరదు.. కారుణ్య నియామకాలపై హైకోర్టు
కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే కుటుంబాన్ని పోషించుకోవచ్చని ఆశపడుతున్న ఆ ఆభాగ్యురాలి ఆశ నెరవేరే పరిస్థితి కనిపించటం లేదు. ఓటు వేశాం న్యాయం చేస్తారని అనుకున్న ప్రభుత్వమూ కరుణించటం లేదు. 20 ఏళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తూ కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కని పరిస్థితి. అయినా ఆశచావక రాజధానిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రులకు చెప్పుకుందామని వస్తే అక్కడ వారికి ఎదురయ్యింది చీత్కారాలే.
కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన అభాగ్యురాలు పేరు ఆర్పీ రేణుక. సాంఘిక సంక్షేమశాఖలో పనిచేసే తన సోదరి 2004లో విధుల్లోనే మృతి చెందటంతో కారుణ్య నియామకానికి దరఖాస్తు చేశారు. దానికి స్థానిక జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కూడా కారణ్య నియామకం కోసం ఆమెకు హామీ ఇస్తూ అధికారిక లేఖ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఆమె అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. డిపెండెంట్గా తనకు ఉద్యోగం ఇస్తారేమోనన్న ఆశతో అమరావతి సచివాలయానికి వచ్చిన ఆమెకు మంత్రి మేరుగ నాగార్జున నుంచి చీత్కారాలు ఎదురయ్యాయి. కుటుంబంతో సహా మంత్రికి మొరపెట్టుకుంటే బయటకు పొమ్మంటూ మంత్రి రంకెలేశారని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. గన్ మెన్లతో బయటకు నెట్టించారని కన్నీరు పెట్టుకుంది. బైట్స్