ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణకు హైదరాబాద్ కామధేనువు.. : మంత్రి కేటీఆర్‌ - కొత్తగూడ పై వంతెన ప్రారంభించిన కేటీఆర్

Kothaguda Flyover Inauguration :తెలంగాణకు కామధేనువు హైదరాబాదే కాబట్టి ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే 50 ఏళ్ల వరకు మంచి నీటి కొరత లేకుండా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ కొత్తగూడ నుంచి కొండాపూర్‌ వరకు రూ.263 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు.

Kothaguda Flyover Inauguration
హైదరాబాద్​ రాష్ట్రానికి కల్పతరువు.. అందుకే ఈ అభివృద్ధి: మంత్రి కేటీఆర్‌

By

Published : Jan 1, 2023, 4:03 PM IST

Kothaguda Flyover Inauguration : తెలంగాణకు కామధేనువు హైదరాబాదే కాబట్టి ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం వచ్చాక అభివృద్ది, సంక్షేమం రెండు జోడెద్దులుగా ముందుకు పోతున్నాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్ కొత్తగూడ నుంచి కొండాపూర్ వరకు ఎస్‌ఆర్‌డీపీ కింద రూ.263 కోట్ల వ్యయంతో సుమారు 3.3 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఫ్లైఓవర్​ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

రాబోయే 50 ఏళ్ల వరకు మంచినీటి కొరత లేకుండా చేస్తున్నామని.. కాళేశ్వరం, సుంకిశాలతో నీళ్లు తెస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తి చేశామన్నారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు కూడా చేపట్టామని పేర్కొన్నారు. నగరానికి 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకురానున్నామని కేటీఆర్ తెలిపారు.

'అభివృద్ధి, సంక్షేమం అనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రానికి కల్పతరువు వంటిది హైదరాబాద్‌ నగరం. అందరికీ ఉపాధి ఇస్తున్నందున ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాం. రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో ప్రాజెక్టులు చేపట్టాం. ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తి చేశాం. మరో 11 ప్రాజెక్టులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు కూడా చేపట్టాం. 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్మిస్తున్నాం.'- కేటీఆర్‌, ఐటీ శాఖ మంత్రి

ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ రంజిత్ రెడ్డి, శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, శాసనమండలి సభ్యురాలు వాణిదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్​ రాష్ట్రానికి కల్పతరువు.. అందుకే ఈ అభివృద్ధి: మంత్రి కేటీఆర్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details