ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా.. ప్రధాన ఆలయాల ప్రచార రథాలతో ప్రచారం: మంత్రి కొట్టు - దేవాదయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

MINISTER KOTTU SATYANARAYANA : రాష్ట్రంలో ప్రధాన ఆలయాలైన అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల ప్రచార రథాలతో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.

MINISTER KOTTU SATYANARAYANA
MINISTER KOTTU SATYANARAYANA

By

Published : Mar 22, 2023, 11:49 AM IST

MINISTER KOTTU SATYANARAYANA: రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా.. ఏడు ప్రముఖ దేవాలయాల ప్రచార రథాల ద్వారా ధర్మ ప్రచార కార్యకమాన్నిచేపట్టనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ కమిటీ సమావేశంలో మాట్లాడిన మంత్రి.. దేవాలయాల్లో రోజువారీ జరగాల్సిన నిత్య పూజా కార్యక్రమాలన్నీసక్రమంగా జరగాలని.. ఆ విషయంలో ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా చూసుకోవాల్సిందిగా సూచించారు. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల ప్రచార రథాల ద్వారా హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్నిచేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు.

ప్రజల్లో హిందూ ధర్మ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను, నైతిక విలువలను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ ధర్మ ప్రచార కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అంశం పైన పురాణ ఇతిహాసాలకు సంబంధించి చిన్న చిన్న పుస్తకాలను ప్రచురించి ప్రజలకు పంపిణీ చేయడం ద్వారా వారిలో హిందూ ధర్మ పరిరక్షణపై అవగాహన పెంపొందుతుందని ఆయన తెలిపారు. ప్రచార రథాలు ఆయా గ్రామాలు, పట్టణాల సందర్శనకు సంబంధించిన తేదీలు, సమయాలు ముందుగానే తెలియజేసి వివిధ దేవాలయాలు, ఆధ్యాత్మిక సంస్థలు, ఆధ్యాత్మిక వేత్తలను భాగస్వాములను చేయాల్సిందిగా మంత్రి సూచించారు.

"హిందూ ధర్మాన్ని పరిరక్షించడం, ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు, నైతిక విలువలు పెంపొందించడం, కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను చాటిచెప్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రచార రథాలు ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఎప్పుడు వెళ్లనున్నాయనేది ముందుగానే తెలియజేసి, అక్కడి ఆధ్యాత్మిక సంస్థలు, ఆధ్యాత్మికవేత్తలు తదితరులను భాగస్వాములను చేయాలి"-కొట్టు సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి

మరోవైపు రాష్ట్ర శ్రేయోభివృద్ధి లక్ష్యంగా విజయవాడలో లక్ష్మీ సుదర్శన రాజ శ్యామల సుదర్శన సహిత మహాలక్ష్మీ యజ్ణాన్ని నిర్వహించాలని సంకల్పించామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా పెద్ద జియంగార్ పీఠాధిపతి, పుష్పగిరి పీఠాధిపతితో పాటు టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. యజ్ణం నిర్వహణకు సంబంధించిన తేది, ముహూర్తం తదితర ఏర్పాట్లపై దేవాదాయశాఖతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details