ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Injury: పైకప్పు పెచ్చులూడి విద్యార్థినికి గాయాలు.. స్పందించిన మంత్రి - బాపట్లలో పైకప్పు పెచ్చులూడి విద్యార్థినికి గాయాలు వార్తలు

గుంటూరు జిల్లాలోని బాపట్ల వ్యవసాయ కళాశాల వసతి గృహంలో.. పైకప్పు పెచ్చులూడి ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. పాత గదుల్లో ఉండలేమంటూ హాస్టల్ వద్ద.. విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వెంటనే అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామి ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. ఘటనపై స్పందించిన మంత్రి కన్నబాబు.. విద్యార్థులను సురక్షిత భవనాల్లో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

minister kannababu reacts over injury to student at bapatla agriculture college hostel
పైకప్పు పెచ్చులూడి విద్యార్థినికి గాయాలు.. స్పందించిన మంత్రి

By

Published : Sep 27, 2021, 3:24 PM IST

గుంటూరు జిల్లాలోని బాపట్ల వ్యవసాయ కళాశాల(bapatla agriculture college) వసతి గృహంలో.. పైకప్పు పెచ్చులూడి ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి(injury). బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న నాగమణిశ్వరి అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉండగా.. పైకప్పు పెచ్చులూడి తల మీద పడ్డాయి. దీంతో విద్యార్థినులు పాత గదుల్లో ఉండలేమంటూ హాస్టల్ వద్ద నిరసనకు దిగారు. వెంటనే కళాశాల అధికారులు వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులకు వేరే గది కేటాయించడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. గాయపడిన విద్యార్థినిని ఇంటికి పంపించి.. అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకుంటున్నారని వారు ఆరోపించారు. పాత భవనంలో వసతి ఇచ్చిన అధికారులపై చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఘటనపై మంత్రి కన్నబాబు స్పందన

బాపట్ల వ్యవసాయ కళాశాల ఘటనపై.. మంత్రి కన్నబాబు స్పందించారు. ఘటనపై వర్సిటీ వీసీ విష్ణువర్ధన్‌రెడ్డితో చర్చించగా.. విద్యార్థిని ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు వివరించారు. వర్సిటీ వసతి గృహాలకు మరమ్మతులు చేయించాలని.. విద్యార్థులను సురక్షిత భవనాల్లో ఉంచాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు.

ఇదీ చదవండి:

GULAB EFFECT: కూలిన గోడలు.. విరిగిపడిన కొండచరియలు.. మహిళ మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details