ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిర్చి యార్డుల్లో వికేంద్రీకరణ పద్దతిలో క్రయ విక్రయాలు! - మిర్చి యార్డుల్లో వికేంద్రీకరణ పద్దతిలో క్రయ విక్రయాలు

గుంటూరు మిర్చి యార్డులో క్రయ విక్రయాల పునః ప్రారంభ అంశంపై మంత్రి కన్నబాబు.. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖతో సమీక్ష నిర్వహించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో మార్కెట్ యార్డుల్లో వికేంద్రీకరణ పద్దతిలో క్రయ విక్రయాలకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

minister kanna babu review
minister kanna babu review

By

Published : May 19, 2020, 1:36 PM IST

గుంటూరు మిర్చియార్డులో క్రయ విక్రయాల పునః ప్రారంభ అంశంపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. మార్క్‌ఫెడ్‌ కార్యాలయంలో సంబంధిత ఉన్నతాధికారులు, ట్రేడర్​లు, కమిషన్ ఏజెంట్లతో ఆయన సమావేశం అయ్యారు. లాక్​డౌన్ వల్ల మూతబడిన ఈ మిర్చియార్డులో క్రయ విక్రయాలు ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత లాక్‌డౌన్‌ సడలింపు నేపథ్యంలో మిర్చి యార్డు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ పరిమిత సిబ్బందితో సామాజిక దూరాన్ని, వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ కార్యకలాపాలకు అవకాశం ఉండేలా ప్రయత్నాలు జరపాలని అధికారులు సూచించారు. ముందుగా శాంపిల్ బేస్‌ మీద కొద్ది కొద్దిగా క్రయ విక్రయాలు చేస్తే బాగుంటుందని పలువురు సూచనలు చేశారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో మార్కెట్ యార్డులో వికేంద్రీకరణ పద్దతిలో క్రయ విక్రయాలుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details