ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరిశ్రమల ప్రోత్సహకానికి నూతన పాలసీ' - minister goutham meeting at guntur

రాష్ట్రంలో తయారైన వస్త్రాలు అమెరికాకు ఎగుమతి చేసే స్థాయికి వస్త్ర పరిశ్రమలు ఎదగాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆకాంక్షించారు.

'పరిశ్రమల ప్రోత్సహకానికి నూతన పాలసీ'

By

Published : Nov 13, 2019, 7:39 AM IST

'పరిశ్రమల ప్రోత్సహకానికి నూతన పాలసీ'
రాష్ట్రంలో పరిశ్రమల ప్రోత్సహకానికి త్వరలో నూతన పాలసీని తీసుకొస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చికాకానిలో భారత వస్త్ర పరిశ్రమల మిషన్ల తయారీ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని ప్రసంగించారు. పరిశ్రమలకు కావాల్సిన అవసరాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎప్పటికప్పుడు అధునాతన పద్ధతులను ఉపయోగిస్తూ అమెరికాకు వస్త్రాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details