ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంత్రి గారు... నా ఆవేదన వినండి సార్.. !' - ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజా వార్తలు

గుంటూరు జిల్లా పూర్వపు కలెక్టర్‌ కోన శశిధర్‌పై... మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో వైకాపా నేతల ఓటమికి ఆయన కృషిచేశారని డీఆర్సీ సమావేశంలో ఆరోపించారు. అయితే... ఆ ఉద్యోగులు మధ్యాహ్నం వరకు తెలుగుదేశానికి, తర్వాత వైకాపాకు ఓటేశారని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరకువాడ శ్రీరంగనాథ్‌ వ్యాఖ్యానించడం కొసమెరుపు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఆళ్ల రామకృష్ణారెడ్డి

By

Published : Jan 30, 2020, 7:29 PM IST

ఆళ్ల రామకృష్ణారెడ్డి

గుంటూరు డీఆర్సీ సమావేశంలో ఇంఛార్జి మంత్రి, ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. జిల్లా పూర్వపు కలెక్టర్ కోన శశిధర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇది సమీక్షా సమావేశంలో చర్చించాల్సిన అంశం కాదని మంత్రి శ్రీరంగనాథరాజు కొట్టిపారేశారు. తెదేపాకు అనుకూలంగా వ్యవహరించిన కలెక్టర్ కోన శశిధర్​కి ప్రభుత్వంలో కీలక పోస్టింగ్ ఇవ్వటం ఏంటని ఆళ్ల ప్రశ్నించారు. మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ... ఆ ఉద్యోగులు మధ్యాహ్నం వరకు తెలుగుదేశానికి, తర్వాత వైకాపాకు ఓటేశారని వ్యాఖ్యానించారు. మధ్యలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఈ విషయాలను చర్చిండానికి ఇది వేదిక కాదన్నారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details