గుంటూరు జిల్లా చిలకలూరిపేట పురుషోత్తమపట్నంలో గురువారం రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి ఎమ్మెల్యే విడదల రజిని కుటుంబ సభ్యులతో మంత్రి చెరుకువాడ రంగనాథరాజు చర్చించారు. కోటప్పకొండ తిరుణాళ్ల నుంచి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున చిలకలూరిపేట ఎమ్మెల్యే మరిది విడుదల గోపీనాథ్ ప్రయాణిస్తున్న కారుపై దుండగులు దాడి చేశారు. ఘటనలో కారు అద్దాలను పగలగొట్టారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే వర్గీయులు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు శుక్రవారం సాయంత్రం చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ఇంటికి వచ్చారు. దెబ్బతిన్న కారును పరిశీలించారు. దాడి ఘటనకు సంబంధించి పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని మంత్రి ఆదేశించారు.
ఎమ్మెల్యే బంధువు కారుపై దాడి ఘటనపై మంత్రి ఆరా - మంత్రి శ్రీరంగనాథ రాజు వార్తలు
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మరిది ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే విడుదల రజిని ఇంటికి వెళ్లి ఘటనపై మంత్రి ఆరా తీశారు. ఘటనలో ధ్వంసమైన కారును పరిశీలించారు.
Minister Cherukwada Ranganatha Raju discusses MLA's rajini with family members