జగనన్న పేదల కాలనీల్లో రూ.32వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించనున్నామని.. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు వెల్లడించారు. గతంలో మాదిరిగా ఇళ్లు మంజూరు చేసి చేతులు దులుపుకోమని.. ఈ కాలనీల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వాటా కంటే.. మూడురెట్లు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలనీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి మండలి, పక్కా గృహాల నిర్మాణ పురోగతిపై.. మంత్రి సమీక్ష చేపట్టారు. ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని.. కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన 80 లక్షల ఇళ్లలో 20 లక్షల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తూ దేశంలోనే ప్రథమస్థానంలో ఉందని తెలిపారు.
Review on housing: 'జగనన్న పేదల కాలనీల్లో రూ.32వేల కోట్లతో మౌలిక సదుపాయాలు' - రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధరాజు వార్తలు
జిల్లా అభివృద్ధి మండలి, పక్కా గృహాల నిర్మాణ పురోగతిపై.. గుంటూరు కలెక్టరేట్లో మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు సమీక్ష చేపట్టారు. జగనన్న పేదల కాలనీల్లో రూ.32వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు.
'జగనన్న పేదల కాలనీల్లో రూ.32వేల కోట్లతో మౌలిక సదుపాయాలు'