గత ప్రభుత్వ హయాంలో రెయిన్ గన్ల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రెయిన్ గన్ల వినియోగంపై మండలిలో వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానమిచ్చారు. మొత్తం 120 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మంత్రి ఆరోపించారు. రెయిన్ గన్లను రైతులకే అందజేసి... సద్వినియోగం అయ్యేలా చూడాలని తెదేపా సభ్యులు కోరారు. అమరావతి నిర్మాణంపైన.. తెదేపా సభ్యులకు, మంత్రికి మధ్య వాగ్వాదం నడిచింది.
అవినీతి ఆరోపణలతో మండలిలో వాగ్యుద్ధం - MLC Ashik babu
మండలిలో తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు, మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. అమరావతిలో భవనాల నిర్మాణంపై అశోక్ బాబు... మంత్రిపై విమర్శలు చేశారు. జవాబు ఇచ్చిన మంత్రి బొత్స... గత తెదేపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

అమరావతిపై మంత్రి బొత్స వ్యంగ్యాస్త్రాలు