ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీఎంఏవై గృహాలను జూలై 8న లబ్ధిదారులకు అందిస్తాం: బొత్స - పేదలకు ఇళ్ల స్థలాలపై బొత్స సత్యనారాయణ

పీఎంఏవై గృహాలను జూలై 8న లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 52 ఎకరాల్లో నిర్మించి పీఎంఏవై గృహ నిర్మాణ సముదాయాలను మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు.

minister botsa satyanarayana on PMAY houses
పీఎంఏవై గృహాలపై బొత్స సత్యనారాయణ

By

Published : Jun 15, 2020, 5:58 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 52 ఎకరాల్లో నిర్మించి పీఎంఏవై గృహ నిర్మాణ సముదాయాలను మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎమ్మెల్యే విడదల రజినితో కలిసి పరిశీలించారు. రాష్ట్రంలో అర్హులైన 30 లక్షల మంది లబ్ధిదారులకు జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

పీఎంఏవై గృహాలనూ ఆ రోజే లబ్ధిదారులకు ఇస్తామని చెప్పారు. చిలకలూరి పేటలో పూర్తి చేసి ఉన్న 5712 ఇళ్లను పరిశీలించినట్లు బొత్స తెలిపారు. ఇందులో 250 ఇళ్లు ఇంకా పూర్తికాలేదన్నారు. 300 చదరపు అడుగులలో నిర్మించిన గృహాలకు సంబంధించి లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.2.65 లక్షలు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details