ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదల ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తాం: మంత్రి బొత్స - పేదల ఇళ్లపై మంత్రి బొత్స కామెంట్స్

గుంటూరు జిల్లా కొర్నేపాడులో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు బొత్స, సుచరిత పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇళ్లు నిర్మించేందుకు.. పేద ప్రజలకు లక్షా 80 వేల రూపాయలు ఇస్తామని మంత్రి బొత్స వెల్లడించారు.

minister bosta on construction of houses for the poor people
పేదల ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తాం

By

Published : Jan 9, 2021, 7:32 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇళ్లు నిర్మించేందుకు లక్షా 80 వేల రూపాయలు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి సుచరితతో కలసి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం 18 వేల మందికి ఇళ్ల పట్టాలను అందజేశారు. ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే సిమెంట్, ఇసుక, ఇనుము ధరలు పెరిగాయన్న ఆయన...బయట మార్కెట్ ధర కన్నా తక్కువకే వాటిని పేదల ఇళ్ల కోసం అందిస్తామన్నారు.

కులాల చిచ్చు పెడుతున్న ప్రతిపక్షం

రాష్ట్రంలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్షం కుట్రలు చేస్తుందని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి ఇలా విభేదాలు సృష్టించటం మంచిది కాదన్నారు.

ఇదీచదవండి

ఎన్నికల కోడ్​ను సక్రమంగా పాటించేలా చూడాలి: ఎస్​ఈసీ

ABOUT THE AUTHOR

...view details