ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతిపై బొత్స మళ్లీ కీలక వ్యాఖ్యలు - చంద్రబాబు

రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైకాపా 100 రోజుల పాలనపై తెదేపా నేతలు పుస్తకం విడుదల చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా అని తెదేపా నేతలను ప్రశ్నించారు. అన్నీ తాత్కాలికం పేరుతో నిర్మించిన మీరా.. జగన్​ పాలనను విమర్శించేది అని దుయ్యబట్టారు.

బొత్స సత్యనారాయణ, మంత్రి.

By

Published : Sep 7, 2019, 2:16 PM IST

Updated : Sep 7, 2019, 3:38 PM IST

ఏపీ రాజధానిపై గెజిట్​ నోటిఫికేషన్ ఇచ్చారా..?

రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ స్పందించారు. ఏపీ రాజధాని అమరావతి అని తెదేపా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందా అని ప్రశ్నించారు.అన్నీ తాత్కాలికం పేరుతో నిర్మించిన మీరా జగన్​ పాలనను విమర్శించేది అని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రానికి చిరునామా లేకుండా చేసింది మీరు కాదా అని ప్రశ్నిచారు. మా 100 రోజుల పాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆశాభావం వ్యక్తం చేశారు.

మా పాలన 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇది చిరస్థాయిగా నిలిచిపోతుంది. వైకాపా పరిపాలనను 'రాక్షసపాలన, తుగ్లక్​ పాలన' అని చంద్రబాబు, లోకేశ్​లు పోల్చడం హాస్యాస్పదం. మీరు చేయలేని ఎన్నో పనులు జగన్​ చేసి చూపిస్తున్నారు. తెదేపా అధికారంలో ఉన్నపుడు మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. అప్పటికంటే ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపలో ఉన్నాయి. పురోగతిని అడ్డుకోవడానికే ప్రతిపక్షం అసత్య ఆరోపణలు చేస్తోంది . కోడెల, కూన రవికుమార్​లు ఏం తప్పు చేయలేదా..? ఏపీ రాజధాని అమరావతి అని అధికారిక ప్రకటన చేశారా?. మీరేం చేసినా..పెట్టుబడిదారులు ఎక్కడికి పోరు. రాష్ట్రాభివృద్ధికి మా ప్రణాళికలు మాకున్నాయి. తెదేపా నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచింది.

-- బొత్స సత్యనారాయణ, మంత్రి.

ఇవీ చదవండి...వైకాపా ప్రభుత్వ బాధితుల శిభిరాన్ని సందర్శించిన లోకేష్

Last Updated : Sep 7, 2019, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details