ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలను తెదేపా మానుకోవాలి: ఆళ్ల నాని - కరోనా వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన జర్మన్​ షెడ్లను వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. తెదేపా నేతలు ఆసుపత్రుల సందర్శనంటూ కరోనా రోగులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని మండిపడ్డారు.

alla nani on tdp leaders
ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం తెదేపా మానుకోవాలి

By

Published : May 24, 2021, 5:08 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో.. కరోనా రోగుల కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన జర్మన్​ షెడ్లను ఆయన ప్రారంభించారు.

గత ఏడాది కాలంగా కరోనా విలయతాండవం చేస్తుంటే తెదేపా నేతలు.. చంద్రబాబు ఇళ్లకే పరిమితమయ్యారంటూ నాని విమర్శించారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటూ యంత్రాంగం పని చేస్తుంటే.. తెదేపా నేతలు అడ్డుపడుతున్నారన్నారు. ఆసుపత్రుల వద్దకు వచ్చి హైడ్రామాకు తెర లేపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులకు టూరిజం శాఖ నుంచి నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా శానిటేషన్​ను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఇబ్బంది కలిగించేలా తెదేపా నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు కరోనా అంశంలో చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి అసెంబ్లీలో వివరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇకనైనా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని మంత్రి నాని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details