ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉచిత విద్యుత్ నిలిపివేసేందుకే.. మీటర్లు బిగిస్తున్నారు - వైకాపా ప్రభుత్వంపై ఆలపాటి రాజా

ఉచిత విద్యుత్ ను నిలిపివేసేందుకే విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే నెపంతో ఎంత దోచుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించారు.

minister alapalti raja on free current
మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

By

Published : Sep 4, 2020, 2:15 PM IST

వైకాపా ఎమ్మెల్యేలే పంట ఉత్పత్తుల కొనుగోలులో దళారులుగా మారి, రైతుల నోట్లో మట్టి కొట్టారని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. రైతులకు ఈ ప్రభుత్వం ఎంత ఖర్చుచేసిందనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి, రైతుల పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తే..., జగన్ ఎందుకు అమలుచేస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్​ను నిలిపేస్తున్నారా అని ఆలపాటి నిలదీశారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే నెపంతో ఎంత దోచుకోవాలనుకుంటున్నారని రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details