ఆక్వా సాగు ఎగుమతులల్లో దేశంలోనే ఏపీ ముందంజలో ఉందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండల పరిధిలోని గ్రామాల్లో.. సీసీ రోడ్లకు, తాగునీటి పథకాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిజాంపట్నంలోని మత్స్యకారుల సంఘాలకు జీడీసీసీ బ్యాంక్ ద్వారా 6 కోట్ల రూపాయల రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. నిజాంపట్నం హార్బర్ అభివృద్ధికి రూ. 340 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి చెప్పారు. ఆక్వా ఎగుమతులు మరింత పెంచే విధంగా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు.
ఆక్వా సాగులో దేశంలోనే ఏపీ ముందంజ: మంత్రి మోపిదేవి - nijampatnam latest news
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో మంత్రి మోపిదేవి వెంకటరమణరావు పర్యటించారు. అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. జీడీసీసీ బ్యాంకు ద్వారా మంజూరు అయిన రుణాల చెక్కులను మత్స్యకారులకు అందజేశారు.
మత్స్యకారులకు చెక్కును అందిస్తున్న మంత్రి మోపిదేవి